విచిత్ర కవలలు 1వ భాగం – దినదిన గండం

కొన్నివేల సంవత్సరాల క్రిందట, శ్రావస్తి నగరాన్ని దానశీలుడనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి  దానశీలుడే గొప్ప. ఏమంటే లక్షలకొలది  సైన్యం వుంది, దాసదాసీ జనాలకు లెక్కలేదు. ఇక ఆరాజు ధనాగారం రత్నాలు, మొహరీలు, వజ్రాలు  వైడూర్యాలు మొదలయిన అన్నిరకాల వెలలేని మణులతోనూ వెండి, బంగారు ధనరాసులతోనూ నిండివుండేది. ...